Allu Arjun: అల్లు అర్జున్ ను కలిసిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు

Pushpa Meets Punjab Kings Stars Ahead Of SRH vs PBKS IPL 2023 Match
  • సన్ రైజర్స్ తో మ్యాచ్ కోసం నగరానికి వచ్చిన పంజాబ్ జట్టు
  • సిటీలో బన్నీని కలిసిన రాహుల్ చహర్, హర్ ప్రీత్ బ్రర్ దంపతులు
  • నేడు రైజర్స్ తో పోటీ పడనున్న పంజాబ్

పుష్ప సినిమాతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ హీరోగా మారిపోయారు. పుష్ప పార్టు2 కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. బన్నీకి దేశంలో ఎంతో మంది అభిమానులుగా మారారు. వారిలో సెలెబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఉన్నారు. బన్నీని కలిసేందుకు, ఆయనతో ఫొటో దిగేందుకు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు బన్నీని కలిశారు.

ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌ కోసం నగరానికి వచ్చిన పంజాబ్ కింగ్స్‌కు చెందిన రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ దంపతులు అల్లు అర్జున్‌తో సమయం గడిపారు. శనివారం వారు అతనితో తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాహుల్ చాహర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీనికి సంబంధించిన ఫొటో షేర్ చేశాడు. హైదరాబాద్ లో ఎవరిని కలవడం బెస్ట్? అంటూ బన్నీని ట్యాగ్ చేశాడు. ఓ పార్టీలో వీరు బన్నీని కనిసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News