Allu Arjun: రికార్డుల దుమ్ము దులుపుతున్న పుష్ప-2లో బన్నీ లుక్

Allu Arjun first look in Pushpa 2 The Rule set all time record on social media platforms

  • నిన్న పుష్ప-2 ద రూల్ నుంచి అల్లు అర్జున్ లుక్ విడుదల
  • అమ్మవారి వేషంలో బీభత్సానికి ప్రతీకలా ఉన్న బన్నీ
  • సోషల్ మీడియాలో లైకుల వెల్లువ
  • ఇది ఆల్ టైమ్ రికార్డు అని వెల్లడించిన సుకుమార్ రైటింగ్స్

పుష్ప-2 ద రూల్ నుంచి నిన్న విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రికార్డుల మోత మోగిస్తోంది. సోషల్ మీడియాలో అత్యధిక లైకులు పొందిన ఫస్ట్ లుక్ గా చరిత్ర సృష్టించింది. అమ్మవారి వేషంలో రౌద్రం ఉట్టిపడేలా కనిపిస్తున్న అల్లు అర్జున్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

బన్నీ ఇలాంటి గెటప్ లో కనిపిస్తాడని ఎవరూ ఊహించలేదు. దాంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ లుక్ గురించే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో పుష్ప-2 ప్రకంపనలు సృష్టిస్తోంది. 

బన్నీ ఫస్ట్ లుక్ కు ఇన్ స్టాగ్రామ్ లో 50 లక్షల లైకులు, ఫేస్ బుక్ లో 8.50 లక్షల లైకులు, ట్విట్టర్ లో 2.07 లక్షల లైకులు వచ్చాయి. ఈ మూడు సోషల్ మీడియా వేదికల్లో మరే ఇతర ఫస్ట్ లుక్ కు ఈ స్థాయిలో లైకులు రాలేదని, ఇది ఆల్ టైమ్ రికార్డు అని చిత్ర నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ వెల్లడించింది.

Allu Arjun
Pushpa-2 The Rule
All Time Record
First Look
Social Media
  • Loading...

More Telugu News