Khushbu: అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఖుష్బూ

Khushbu hospitalized in Hyderabad with high fever

  • తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఖుష్బూ
  • అదృష్టవశాత్తు మంచి ఆసుపత్రిలో చేరానని వెల్లడి
  • జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసంతో బాధపడుతున్నానని వివరణ

ప్రముఖ నటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ అనారోగ్యం పాలయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

తాను అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని ఖుష్బూ స్వయంగా వెల్లడించారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసంతో బాధపడుతున్నానని, అయితే మంచి ఆసుపత్రిలో చేరడం ఆనందం కలిగిస్తోందని తెలిపారు. ఆ మేరకు ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కొద్దిపాటి అనారోగ్యం అయినా నిర్లక్ష్యం వహించకుండా చికిత్స పొందాలని ఆమె అభిమానులకు సూచించారు. లేకపోతే చాలా రోజుల పాటు అనారోగ్యంతో బాధపడాల్సి ఉంటుందని తెలిపారు.

Khushbu
Fever
Apollo
Hyderabad
BJP
  • Loading...

More Telugu News