Chandrababu: నెల్లూరులో టిడ్కో ఇళ్ల వద్ద నిల్చుని సీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరిన చంద్రబాబు

Chandrababu visits TIDCO Houses and throw a selfie challenge to CM Jagan
  • నెల్లూరులో టీడీపీ జోన్-4 సమావేశం
  • హాజరైన చంద్రబాబు
  • నెల్లూరులో తాము నిర్మించిన టిడ్కో ఇళ్ల సందర్శన
  • నువ్వు కట్టిన ఇళ్లు ఎక్కడ? అంటూ సీఎం జగన్ కు సవాల్
నెల్లూరులో టీడీపీ జోన్-4 సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో తాము నిర్మించిన వేలాది టిడ్కో ఇళ్లను సందర్శించారు. టిడ్కో ఇళ్ల వద్ద నిల్చుని తన మొబైల్ ఫోన్ తో సెల్ఫీ దిగారు. ఈ క్రమంలో సీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. 

"చూడు....జగన్! ఇవే మా ప్రభుత్వ హాయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు" అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యాలు అంటూ స్పష్టం చేశారు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? అసలు, నువ్వు కట్టిన ఇళ్లెక్కడ... జవాబు చెప్పగలవా? అంటూ జగన్ ను ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫోటోను చంద్రబాబు పంచుకున్నారు. 

రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలోనూ సెల్ఫీ చాలెంజ్ లు విసురుతూ ముందుకు సాగుతున్నారు.
Chandrababu
TIDCO Houses
Nellore
Selfie Challenge
TDP
Jagan
YSRCP

More Telugu News