Anand Mahinda: షర్ట్ ని ఫోల్డ్ చేయడం ఎంత సులభమో.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ఇదిగో

Anand Mahinda is simply fascinated by the technique this woman uses to fold a t shirt Watch video

  • ఎంతో సృజనాత్మకంగా ఉందన్న ఆనంద్ మహీంద్రా  
  • సమయాన్ని ఆదా చేస్తుందని వివరణ  
  • ఇలాంటి వాటికి ఆకర్షితులు కాకుండా ఉండలేనని ట్వీట్

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సరికొత్త వీడియోతో, కొత్త అంశంతో తనను అనుసరించే వారి ముందుకు వచ్చారు. ఈ విడత ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసిన వీడియో.. ఓ మహిళ షర్ట్ ని చాలా సులభంగా ఫోల్డ్ చేస్తుండడాన్ని తెలియజేస్తోంది. టీ షర్ట్ ని ఆమె కేవలం ఐదు సెకండ్లలోనే ఫోల్డ్ చేసి చూపించింది.

ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా ఎన్నో వినూత్నమైన, సమాచార అంశాలను పది మందితో పంచుకుంటూ ఉంటారు. ఆయన పంచుకునే విషయాలు పది మందిని ఆలోచింపచేసేవిగా, ప్రోత్సహించేవిగా ఉంటుంటాయి. మనం ఒక షర్ట్ ని ఫోల్డ్ చేయడానికి కొన్ని నిమిషాల పాటు సమయం తీసుకుంటాం. రెడీమేడ్ వస్త్ర కంపెనీల్లో ప్యాకింగ్ వేగంగా చేయాలి. అందుకోసం వారు టెక్నిక్ లతో వేగంగా వస్త్రాలను మడత పెట్టేస్తుంటారు. ఆ టెక్నిక్ మనకూ తెలిస్తే.. ఇంట్లో మనమూ చాలా వేగంగా డ్రెస్ లను సర్దుకోవచ్చు. ఈ వీడియోలో అదే అంశం కనిపిస్తోంది. 

ఇలాంటి విషయాల పట్ల ఆకర్షితుడు కాకుండా ఉండలేనంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ‘‘ఇదేమీ ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు. కానీ, ఎంతో సృజనాత్మకంగా ఉంది. ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

Anand Mahinda
t shirt folding
technique
woman
vedio
share
  • Loading...

More Telugu News