Sobhita Dhulipala: సోదరి సమంతను పెళ్లి కుమార్తెగా చూసి కన్నీళ్లు వచ్చాయి: శోభిత ధూళిపాళ్ల

Sobhita Dhulipala gets emotional about her sisters marriage

  • విశాఖలో ఘనంగా జరిగిన శోభిత సోదరి సమంత వివాహం
  • పెళ్లికూతురిగా సమంతను చూసి భావోద్వేగానికి గురయ్యానన్న శోభిత
  • బంధువులందరం పెళ్లిలో కలుసుకున్నామన్న శోభిత

సినీ నటి శోభిత ధూళిపాళ్ల సోదరి సమంత వివాహం విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో శోభిత కూడా పాల్గొన్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన మెహందీ, సంగీత్ ఫొటోలను శోభిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన సోదరిని పెళ్లికూతురుగా చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. బంధువులందరం ఈ పెళ్లిలో కలుసుకున్నామని చెప్పారు. పెళ్లికి బాగా రెడీ కావాలని అనుకున్నానని... అయితే, పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉండటం వల్ల మెహందీ ఫంక్షన్ కు సరిగా రెడీ కాలేదని తెలిపారు. పెళ్లికూతురుగా ఉన్న సమంతను చూసి ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయని చెప్పారు. 

సంగీత్ ఫంక్షన్ కూడా చాలా సందడిగా జరిగిందని చెప్పారు. వధూవరులు, స్నేహితులు, బంధువులతో కలిసి తాను కూడా డ్యాన్స్ చేశానని తెలిపారు. ఈ పెళ్లిని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. కెరీర్ విషయానికి వస్తే శోభిత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన 'పొన్నియన్ సెల్వన్-2', 'సితార', 'మంకీ మేన్' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Sobhita Dhulipala
Tollywood
Sister
Samantha
Marriage
  • Loading...

More Telugu News