Venkatesh Daggubati: సైంథవ్ లో వెంకీకి హీరోయిన్​ దొరికినట్టే!

Shraddha Srinath to play lead lady role in venkatesh Saindhav Movie
  • శైలేష్ కొలను దర్శకత్వంలో సైంథవ్ చేస్తున్న వెంకటేశ్
  • ప్రధాన హీరోయిన్ గా శ్రద్థా శ్రీనాథ్ ను అనుకుంటున్న చిత్ర బృందం
  • రెండో హీరోయిన్ గా రుహానీ శర్మను ఓకే చేసినట్టు ప్రచారం
కుటుంబ హీరోగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన విక్టరీ వెంకటేశ్ తన అన్నకొడుకు దగ్గుబాటి రానాతో చేసిన ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మితి మీరిన శృంగారం, హింసతో కూడిన ఈ సిరీస్ తో ఓటీటీలో అడుగు పెట్టిన వెంకీ విమర్శల పాలయ్యాడు. ప్రస్తుతం వెంకీ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో హిందీలో సల్మాన్ ఖాన్ తో కలిసి కిసికా జాన్ కిసికా భాయ్ కాగా.. మరోటి సైంధవ్‌. హిట్‌ సినిమా ఫేమ్‌ శైలేష్‌ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతానికి భిన్నంగా ఈ చిత్రంలో వెంకీ భారీ యాక్షన్ సీన్స్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, వీడియో ఆసక్తిని పెంచాయి. త్వరలో షూటింగ్‌ మొదలుకానుంది. 

ఈ సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్‌లు నటించబోతున్నట్లు తెలుస్తుంది. అందులో సెకండ్ హీరోయిన్‌గా రుహాని శర్మను ఖరారు చేసినట్టు సమాచారం. ప్రధాన హీరోయిన్ గా జెర్సీ ఫేం శ్రద్ధ శ్రీనాథ్‌ను పరిశీలిస్తునట్టు తెలుస్తోంది. డైరెక్టర్ శైలేష్ ఇప్పటికే ఆమెకు కథ చెప్పారని, తను కూడా పాజిటివ్ గా స్పందించిందని సమాచారం. కృష్ణ అండ్‌ హిజ్ లీల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ జెర్సీతో మంచి విజయం అందుకుంది. తర్వాత ఆమెకు మరో బ్రేక్ రాలేదు. ఇప్పుడు వెంకీ సరసన నటిస్తే టాలీవుడ్ లో ఆమెకు మరింత గుర్తింపు రావడం ఖాయమే అనొచ్చు.
Venkatesh Daggubati
Saindhav
Shraddha Srinath
hero nani

More Telugu News