Youtube likes: యూట్యూబ్ లో వీడియోలు లైక్ చేస్తే డబ్బులిస్తాం.. వాట్సాప్ సందేశంతో వల!

Will pay money for youtube likes new trend in cybercrime

  • నయా మోసానికి పాల్పడుతున్న సైబర్ దొంగలు
  • నమ్మారంటే బ్యాంక్ ఖాతా మొత్తం ఊడ్చేస్తారు
  • గురుగ్రామ్ యువకుడి ఖాతాలోంచి 8.5 లక్షలు మాయం

మీ ఖాళీ సమయంలో యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ, లైక్ చేస్తూ సంపాదించుకునే అవకాశం.. ఇంట్లో కూర్చుని రోజూ వేలల్లో సంపాదించుకునే మార్గం అంటూ వాట్సాప్ సందేశాలతో సైబర్ నేరస్థులు నయా మోసానికి తెరలేపారు. వాట్సాప్ సందేశాలతో వల వేస్తూ నమ్మినోళ్ల ఖాతాల్లోంచి నగదు మొత్తం కాజేస్తున్నారు. తాజాగా గురుగ్రామ్ కు చెందిన ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

నగరానికి చెందిన సిమ్రన్ జిత్ సింగ్ కు ఇటీవల ఓ వాట్సాప్ సందేశం వచ్చింది. యూట్యూబ్ లో తాము చెప్పిన వీడియోలను లైక్ చేస్తే డబ్బులిస్తామని అందులో పేర్కొంది. రోజూ వేలల్లో సంపాదించుకోవచ్చని ఊరించడంతో సిమ్రన్ జిత్ టెంప్ట్ అయ్యాడు. వాళ్లు చెప్పినట్లు చేసేందుకు అంగీకరించాడు. మరుసటి రోజు ఓ మహిళ ఫోన్ చేసి యూట్యూబ్ లైక్స్ ఒప్పందంలో భాగంగా వ్యాపారపరమైన ఖర్చుల కోసం కొంత మొత్తం జమ చేయాలని సూచించింది.

ఇందుకోసం ఓ లింక్ పంపించింది. సదరు లింక్ పై సిమ్రన్ జిత్ క్లిక్ చేయడంతో విడతలవారీగా ఆయన ఖాతాలో నుంచి రూ.8.5 లక్షలు వేరే ఖాతాలోకి బదిలీ అయ్యాయి. వెంటనే తనకు ఫోన్ చేసిన మహిళను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని సిమ్రన్ జిత్ తెలిపాడు. దీంతో  మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

Youtube likes
cybercrime
new trend
whatsapp msg
cheating
  • Loading...

More Telugu News