Twitter: ఆ కంపెనీలకు ట్విట్టర్ బ్లూ టిక్స్ ఫ్రీ!

Twitter to give free blue ticks to 10000 most followed companies
  • అత్యధిక ఫాలోవర్లు ఉన్న 10 వేల కంపెనీలకు బ్లూ టిక్స్ ఉచితం
  • నెలవారీ ఫీజు నుంచి మినహాయింపు
  • ట్విట్టర్‌లో అత్యధికంగా ఖర్చు చేసే 500 మంది అడ్వర్టైజర్‌లకూ ఫ్రీగా బ్లూ టిక్
‘బ్లూ టిక్స్’ విషయంలో ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధిక ఫాలోవర్లు ఉన్న 10 వేల కంపెనీలకు బ్లూ టిక్ ను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ట్విట్టర్ అధికారిక ఖాతాలకు బ్లూటిక్ విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ ఈ ప్రకటన చేశారు.

బ్లూ టిక్ సభ్యత్వాన్ని పొందేందుకు వెయ్యి డాలర్లు (సుమారు రూ. 82,000) చెల్లించాలని ఇటీవల ట్విట్టర్ స్పష్టం చేసింది. అయితే కొన్నికంపెనీలకు ఈ నెలవారీ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అత్యధిక ఫాలోవర్లు ఉన్న 10 వేల కంపెనీలు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ట్విట్టర్‌లో అత్యధికంగా ఖర్చు చేసే 500 మంది అడ్వర్టైజర్‌లు కూడా తమ బ్లూ టిక్ మార్క్‌ను ఉచితంగా పొందవచ్చు.

మరోవైపు బ్లూ టిక్ ఉన్న వారు మాత్రమే ట్విట్టర్ లో కండక్ట్ చేసే పోల్స్ లో పాల్గొనడానికి అర్హులంటూ మస్క్ ఇటీవల ప్రకటించారు. ఏప్రిల్ 15 తర్వాత వెరిఫై కాని యూజర్లు పోల్స్ లో పాల్గొనలేరని స్పష్టం చేశారు. అలాగే రికమండేషన్స్ లో కూడా వీరి ట్వీట్లు కనిపించవు. అంటే నాన్ వెరిఫైడ్ అకౌంట్ల నుంచి వచ్చే ట్వీట్లు ఎక్కువ మందికి చేరేందుకు వీలు ఉండదు.
Twitter
free blue ticks
10000 most followed companies
Elon Musk

More Telugu News