H1B visa cap: 2023-24 సంవత్సరానికి పూర్తయిన హెచ్1బీ కోటా

H1B visa cap for FY 2024 reached successful applicants informed USCIS

  • అర్హులైన దరఖాస్తు దారుల నుంచి ఎంపిక
  • ఎంపికైన వారికి సమాచారం అందించినట్టు ప్రకటన
  • ఏప్రిల్ 1 నుంచి హెచ్1బీ సబ్జెక్ట్ పిటిషన్ల దాఖలు

హెచ్ 1బీ వీసాల కోటా పూర్తయింది. అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే 2023-24 సంవత్సరానికి గరిష్ఠ పరిమితి మేరకు వీసా దరఖాస్తులు వచ్చాయని యూఎస్ పౌర, వలస సేవల విభాగం ప్రకటించింది. విజయం సాధించిన దరఖాస్తుదారులు అందరికీ సమాచారం అందించినట్లు తెలిపింది.  

తగిన సంఖ్యలో ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను తొలి దశలోనే అందుకున్నట్టు సోమవారం ప్రకటించింది. ‘‘సరైన విధంగా సమర్పించిన అప్లికేషన్ల నుంచి ర్యాండమ్ గా ఎంపిక చేశాం. వారికి సమాచారం కూడా ఇచ్చాం. హెచ్1బీ క్యాప్ (గరిష్ఠ పరిమితి) పిటిషన్లు, అడ్వాన్స్ డ్ డిగ్రీ మినహాయింపు పిటిషన్లను.. యూఎస్ పౌర వలస సేవల విభాగం ముందు ఏప్రిల్ 1 నుంచి దాఖలు చేసుకోవచ్చు’’ అని ప్రకటించింది. ఎంపిక చేసిన పిటిషన్ దారులే హెచ్1బీ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్లను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. యూఎస్ కాంగ్రెస్ వార్షిక హెచ్ 1బీ కేటగిరీ కోటాగా 65,000ను నిర్ధారించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News