Nagababu: సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే.. : నాగబాబు అసహనం

Nagababu spoke at Ram Charans birthday celebrations angry at fans

  • చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో మాట్లాడిన నాగబాబు
  • ‘పవర్ స్టార్ సీఎం’ అంటూ ఫ్యాన్స్ నినాదాలు
  • జనసేన సైనికులు సంస్కారాన్ని వదులుకోవద్దంటూ మెగా బ్రదర్ ఆగ్రహం

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఆదివారం రాత్రి నుంచే మొదలయ్యాయి. ఫ్యాన్స్ తో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రామ్ చరణ్ బాబాయ్, మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడారు. అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆయన కాస్త అసహనానికి గురయ్యారు. వేదికపై నాగబాబు మాట్లాడుతుండగా.. బాల్కనీలో ఉన్న కొందరు నినాదాలు చేశారు. దీంతో నాగబాబు.. ‘‘మాట్లాడతాను.. కాస్త ఆగండి. కల్యాణ్ బాబు గురించి కొద్దిసేపటి తర్వాత మాట్లాడదామని అనుకున్నా. ఇలా అల్లరి చేస్తే అసలు కంటెంట్ పోతుంది. ప్లీజ్.. దయచేసి.. దండం పెడతా.. కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి’’ అని కోరారు.

కానీ బాల్కనీలో ఒకవైపున ఉన్న కొందరు పదేపదే ‘పవర్ స్టార్ సీఎం.. పవర్ స్టార్ సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. తనను తాను నియంత్రించుకుంటూ.. ‘‘మనం ఇవాళ వచ్చింది చరణ్ బర్త్ డే వేడుకలకు కాబట్టి.. మొదట గౌరవం చరణ్ కు ఇవ్వాలి. అది మన సంస్కారం. జనసేన సైనికులు ఆ సంస్కారాన్ని వదులుకోవద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’’ అని చెప్పారు. 

కానీ అరుపులు, నినాదాలు మాత్రం ఇగలేదు. కొద్దిసేపు నిశబ్దంగా ఉన్న నాగబాబు తర్వాత మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్ చాలాసార్లు చెప్పారు కదా.. ‘సీఎం సీఎం అని అరిస్తే కాదు ఓట్లు గుద్ది సీఎంను చేయాలి’ అని అన్నారు కదా. కాబట్టి సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే ఎలక్షన్ లో పాల్గొని జనాల్ని మోటివేట్ చేయండి. అది పవన్ కల్యాణ్ కు మనం ఇచ్చే గొప్ప బహుమతి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటానికే వచ్చానని నవ్వుతూ.. తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Nagababu
RamCharan
nagababu angry at fans
Ram Charans birthday celebrations
Pawan Kalyan
Janasena
  • Loading...

More Telugu News