football stadium: ఇది గుండ్రంగా తిరిగే స్టెయిర్ కేస్!

Spiral staircase of a football stadium in Italy goes viral for being an optical illusion

  • మిలాన్ లోని సిరో ఫుట్ బాల్ స్టేడియంలో ఉన్న ప్రత్యేక స్టెయిర్ కేస్
  • దీన్ని చూడగానే తిరుగుతున్నట్టు అనిపించే భావన
  • అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో నిర్మాణం

నిర్మాణ అద్భుతాలు ఎన్నో ఉంటాయి. నేడు సామాజిక మాధ్యమాల విస్తృతితో ఎన్నో అద్భుతాలు, ప్రదేశాలు, నిర్మాణాలు అందరికీ తెలిసిపోతున్నాయి. అలాంటిదే ఇది కూడా. సైన్స్ గర్ల్ అనే ట్విట్టర్ యూజర్ ఓ వీడియో క్లిప్ ను పోస్ట్ చేసింది. అది ఇటలీలోని మిలాన్ లో సిరో ఫుట్ బాల్ స్డేడియంలో ఉన్న స్టెయిర్ కేస్. చూడ్డానికి చాలా భిన్నమైన నిర్మాణ శైలితో ఉంటుంది. అంతేకాదు, గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అదెలా సాధ్యం? అని మీ కళ్లు మిమ్మల్నే ప్రశ్నిస్తాయి.

స్టెయిర్ కేస్ (మెట్ల మార్గం) వ్యతిరేక దిశలో గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపించినా.. నిజానికి అది ఎటూ తిరగదు. కదలదు కూడా. కాకపోతే స్టెయిర్ కేస్ ను భిన్నమైన డిజైన్ తో, ఆప్టికల్ ఇల్యూజన్ వచ్చేలా నిర్మించారు. ప్రజలు మెట్లు దిగిపోతుండడం వల్ల గుండ్రంగా ఉన్న స్టెయిర్ కేస్ తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు 56 లక్షల మంది ఈ వీడియోని చూశారు. ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ప్రతిభను చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకోకుండా ఉండలేరు.

football stadium
Spiral staircase
Italy
milan
optical illusion
  • Loading...

More Telugu News