reliance JIO: క్రికెట్ అభిమానులకు జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు

Jio launches 3 new prepaid recharge plans with up to 40GB free data offer

  • రూ.999, రూ.399, రూ.219
  • ఈ మూడు ప్లాన్లలోనూ రోజువారీ 3జీబీ హై స్పీడ్ డేటా
  • ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం వేర్వేరు
  • డేటా యాడాన్ ప్యాక్ లను సైతం ప్రకటించిన జియో

రిలయన్స్ జియో క్రికెట్ అభిమానులకు మూడు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ రెండు నెలల పాటు జరగనుండడం తెలిసిందే. ఐపీఎల్ కు పెద్ద సంఖ్యలో వీక్షకులు ఉన్నారు. దీంతో కొత్త ప్లాన్లను జియో ప్రకటించింది. డేటా అయిపోతుందన్న ఆందోళన లేకుండా, 40జీబీ డేటాని ఉచితంగా పొందొచ్చని జియో ప్రకటించింది. 

రూ.999
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజూ 3జీబీ హై స్పీడ్ డేటా ఉచితం. ఇక అపరిమిత కాల్స్, రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి. ఇవి కాకుండా మరో రూ.241 వోచర్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో 40 జీబీ డేటా కూడా ఉంటుంది. 

రూ.399, రూ.219
ఈ రెండు ప్లాన్లలో రోజువారీ 3జీబీ డేటా లభిస్తుంది. రూ.999 ప్లాన్ మాదిరే కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. రూ.399 ప్లాన్ లో రూ.61 విలువైన వోచర్ ఉచితంగా వస్తుంది. 6జీబీ అదనపు డేటా కూడా పొందొచ్చు. దీని కాల వ్యవధి 28 రోజులు. రూ.219 ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. రోజువారీ 3 జీబీ ఉచిత డేటాకు అదనంగా మరో 2 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది.
 
రూ.444
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో 100 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 60 రోజులు. కాల్స్ ఉచితం. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం.

డేటా యాడాన్
రూ.222 డేటాయాడాన్ ప్యాక్ తో 50జీబీ డేటా లభిస్తుంది. ప్రస్తుత ప్లాన్ ఎక్స్ పైరీ గడువు వరకు అమల్లో ఉంటుంది. రూ.667 డేటా ప్యాక్ తో 150 జీబీ ఉచిత డేటా వస్తుంది. 90 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.

reliance JIO
new prepaid plans
data add on
ipl 2023
recharge plans
  • Loading...

More Telugu News