Chiranjeevi: బ్రహ్మానందాన్ని అభినందించిన చిరూ - చరణ్!

Chiranjeevi and Ramcharan Appriaceared Brahmanandam For Rangamartanda

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'రంగమార్తాండ'
  • తొలి ఆటతోనే హిట్ టాక్ దక్కించుకున్న సినిమా 
  • రంగస్థల నటుడు చక్రపాణిగా కనిపించిన బ్రహ్మానందం
  • సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన ప్రశంసలు 

బ్రహ్మానందం కొన్ని దశబ్దాలుగా పేక్షకులను నవ్విస్తూ వస్తున్నారు. తెరపై ఆయన కనిపిస్తేనే ఆడియన్స్ నవ్వేస్తుంటారు. తెలుగు తెరపై కమెడియన్ గా ఆయన పోషించినన్ని విలక్షణమైన పాత్రలను మరొకరు పోషించలేదంటే అతిశయోక్తి కాదు. ఆయన మేనరిజమ్స్ ను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి బ్రహ్మానందం నటనపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.

నటుడిగా ఇంత సుదీర్ఘ ప్రయాణం తరువాత ఇప్పుడు ప్రశంసలు కురవడం ఏంటని అనుకోవచ్చు. అడపా దడపా మాత్రమే కన్నీళ్లు పెట్టించిన బ్రహ్మానందం, ఎక్కువగా నవ్వులతోనే అభినందనలు అందుకున్నారు. అలాంటి ఆయన 'రంగమార్తాండ' సినిమాతో ఏడిపించేశారు. రంగస్థల నటుడిగా .. వృద్ధాప్యంలో భార్య తోడు లేకుండా ఒంటరి జీవితాన్ని గడపలేని చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం తన నట విశ్వరూపం చూపించారు. 'మన కోసం ఎదురుచూసేవారు లేనప్పుడు మరణించడమే సుఖం' అంటూ హాస్పిటల్ సీన్ లో ఆయన కన్నీళ్లు పెట్టించారు.

ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ఎమోషన్స్ ఉంటాయనే విషయం ప్రేక్షకులకు తెలుసు. కానీ బ్రహ్మానందం పాత్ర ఈ రేంజ్ లో ఏడిపిస్తుందనీ, ఈ పాత్రలో ఆయన ఇంతలా విజృంభిస్తారని గాని ఆడిటోరియం అనుకోలేదు. ఆయన నటన గురించే మరోసారి అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి - చరణ్ ఇద్దరూ కూడా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు. 

Chiranjeevi
Ramcharan
Brahmanandam
Rangamartanda Movie
  • Loading...

More Telugu News