IPL 2023: ఐపీఎల్ లో కొత్త రూల్స్.. టాస్ తర్వాత కూడా టీమ్ ను మార్చుకోవచ్చు!

IPL 2023 rule change teams will name their playing XIs after the toss

  • ఈ ఐపీఎల్ సీజన్ లో కొన్ని మార్పులు చేసిన బీసీసీఐ
  • టాస్ ను బట్టి టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసుకునే వీలు
  • ఫీల్డింగ్, బౌలింగ్ టైమ్ విషయంలోనూ కొత్త నిబంధనలు

మరో వారం రోజుల్లో ధనాధన్ క్రికెట్ మొదలుకాబోతోంది. ఈనెల 31 నుంచి ఐపీఎల్ మెగా టోర్నీ సందడి చేయబోతోంది. అయితే ఈ సారి బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. టాస్ తర్వాత కూడా తుది జట్టును మార్చుకునే కొత్త నిబంధనను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పటిదాకా 11 మంది జట్టు సభ్యులను టాస్‌‌‌‌‌‌‌‌కు ముందే ప్రకటించాల్సి ఉండేది. అయితే తాజాగా ఈ రూల్‌‌‌‌‌‌‌‌ను బీసీసీఐ మార్చేసింది. టాస్‌‌‌‌‌‌‌‌ తర్వాత రిఫరీకి సమర్పించే  11 మంది ప్లేయర్లు, ఐదుగురు సబ్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఫీల్డర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి తమకు నచ్చిన తుది జట్టును ఎంచుకోవచ్చు. అంతకుముందే జట్టును ప్రకటించినా సరే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మార్పులు చేసుకోవచ్చు. దీనివల్ల టాస్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే ఒక టీమ్‌‌‌‌‌‌‌‌ను, ఓడితే మరో టీమ్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకునే వెసులుబాటు దొరుకుతుంది. ఈ కొత్త రూల్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టారు.

మరోవైపు బౌలర్‌‌‌‌‌‌‌‌ నిర్దిష్ట టైమ్‌‌‌‌‌‌‌‌లో తన ఓవర్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేయకపోతే.. ఓవర్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధించనున్నారు. ఈ పెనాల్టీ వల్ల 30 యార్డ్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌ వెలుపల నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు. అలాగే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసే టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యర్థి ఫీల్డర్‌‌‌‌‌‌‌‌, వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ అనవసరంగా/అనైతికంగా తమ పొజిషన్స్‌‌‌‌‌‌‌‌ మార్చుకుంటే ఆ బంతిని డెడ్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించి ఐదు రన్స్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధిస్తారు. ఈ ఐపీఎల్ నుంచి ఈ రూల్స్ అమలు కానున్నాయి.

IPL 2023
rules change
BCCI
new rules in ipl
  • Loading...

More Telugu News