Vishwak Sen: ఈ సినిమాకి ఎక్కువ డబ్బులు పెట్టేశాను: హీరో విష్వక్ సేన్

Das Ka Dhamki movie pressmeet
  • కొంతసేపటి క్రితం జరిగిన 'దాస్ కా ధమ్కీ' ప్రెస్ మీట్
  • డబ్బుల కోసమే ఈ సినిమా చేయలేదన్న విష్వక్ 
  • సంగీతం హైలైట్ గా నిలుస్తుందని వెల్లడి 
  • ఈ సినిమాను సపోర్టు చెయ్యమని కోరిన విష్వక్ 

విష్వక్సేన్ హీరోగా 'దాస్ కా ధమ్కీ' సినిమా రూపొందింది. దర్శకుడిగా తన సొంత బ్యానర్లో ఆయన చేసిన సినిమా ఇది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేదికపై విష్వక్ మాట్లాడుతూ .. "హీరోగా .. దర్శక నిర్మాతగా ఈ సినిమాతో ట్రావెల్ చేస్తూ వచ్చాను. చాలా హానెస్టుగా ఈ సినిమా కోసం పనిచేశాను" అని అన్నాడు. 

"డబ్బులు సంపాదించు కోవటం కోసం మాత్రమే నేను ఈ సినిమా తీయలేదు. కానీ ఈ సినిమా కోసం ఎక్కువ డబ్బులు పెట్టేశాను. మొదటి నుంచి కూడా మీడియా నన్ను చాలా సపోర్టు చేస్తూ వచ్చింది. ఆడియన్స్ కూడా నన్ను ఈ ఒక్క మెట్టూ ఎక్కిస్తే, ఆ తరువాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడానికి అవసరమైన శక్తి నాకు వస్తుంది" అని చెప్పాడు.

"మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ నాకు ఎలాంటి పాటలు కావాలనేది బాగా అర్థం చేసుకున్నాడు. ఇకపై మేము ఎక్కువ సార్లు కలిసి పనిచేసే అవకాశం ఉంది. నివేద ఇచ్చిన ఒక సూచన మేరకు కూడా కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతూ వెళ్లింది. ఆ పాయింట్ ఏమిటనేది తరువాత చెబుతాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Vishwak Sen
Nivetha Petu Raj
Das Ka Dhamki Movie

More Telugu News