Niharika Konidela: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్న నిహారిక, చైతన్య.. అసలేం జరుగుతోంది?

Niharika and chaitnya unfollows each other in insta

  • ప్రేమించుకుని మూడేళ్ల కింద పెళ్లితో ఒక్కటైన యువ జంట
  • కొన్నాళ్లుగా ఇద్దరికీ పడటం లేదని పుకార్లు
  • ఇన్ స్టా పెళ్లి ఫొటోలనూ తొలగించిన చైతన్య!

మెగా కుటుంబం నుంచి మొదటి హీరోయన్ అయిన కొణిదెల నిహారిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. తాను ప్రేమించిన చైతన్య జొన్నలగడ్డను నిహారిక మూడేళ్ల కిందట పెళ్లి చేసుకుంది. చూడచక్కని ఈ జంట వివాహ బంధం గురించి కొన్నాళ్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, విడిపోవాలని అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదని కుటుంబ సభ్యులు ఖండిస్తున్నా ఈ ప్రచారం ఆగడం లేదు. 

ఈ క్రమంలో నిహారిక, చైతన్య చేసిన పని ఈ పుకార్లకు మరింత ఊతం ఇచ్చినట్టయింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇన్ స్టా లో చైతన్య తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా తొలగించినట్టు తెలుస్తోంది. దీంతో, ఇద్దరి మధ్య విభేదాలు నిజమే అన్న ప్రచారం ఊపందుకుంది.

Niharika Konidela
Chaitanya Jonnalagadda
marriage
Instagram
unfollows
  • Loading...

More Telugu News