Balineni Srinivasa Reddy: ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నట్టు ఎన్నికల ఫలితాలతో అర్థమయింది: బాలినేని శ్రీనివాస్ రెడ్డి

It is understood that the employees and teachers are dissatisfied says Balineni Srinivasa Reddy

  • మూడు ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ
  • ఓటమిని అంగీకరిస్తున్నామన్న మంత్రి బాలినేని
  • ఓటమిపై సమీక్షించుకుంటామని వ్యాఖ్య

ఏపీలో ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలపై వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఓటిమిపై తాము సమీక్షించుకుంటామని తెలిపారు. 

ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నట్టు ఈ ఎన్నికల్లో అర్థమయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఓటర్లలో వీరి శాతం రెండు శాతం మాత్రమేననే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. మూడు ఎమ్మెల్సీ సీట్లకే మొత్తం గెలిచేసినట్టు టీడీపీ నేతలు సంబరపడిపోతున్నారని.... ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Balineni Srinivasa Reddy
YSRCP
MLC Elections
Telugudesam
  • Loading...

More Telugu News