EPFO: ఉద్యోగం మానేశాక ఎన్నాళ్లపాటు పీఎఫ్ వడ్డీ జమవుతుంది..?

Will Your epf account earn interest after leaving job

  • నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని చెబుతున్న నిపుణులు
  • మూడేళ్లకు పైగా పీఎఫ్ ఖాతాలో నగదు జమ కాకుంటే ఇన్ యాక్టివ్ గా మారుతుంది
  • అప్పటి వరకు ఉన్న మొత్తంపై వడ్డీ జమ కావడం నిలిచిపోతుందని వెల్లడి

నెలనెలా అందుకునే జీతంలో నుంచి కొంత ప్రావిడెంట్ ఫండ్ కు జమవుతుంటుంది. ఈ మొత్తంపై క్రమం తప్పకుండా వడ్డీ కూడా చేరుతుంది. అయితే, మూడేళ్ల పాటు పీఎఫ్ జమ కాని సందర్భాలలో వడ్డీ జమ కావడం నిలిచిపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పీఎఫ్ ఖాతాలో సొమ్ముపై వడ్డీ పొందాలంటే సదరు ఖాతా యాక్టివ్ గా ఉండాలని వివరించారు. మూడేళ్లకు పైగా ఉద్యోగానికి విరామం తీసుకుంటే పీఎఫ్ ఖాతా ఇన్ యాక్టివ్ గా మారుతుందని తెలిపారు.

ఉద్యోగం మారినపుడు పీఎఫ్ కు సంబంధించి కొత్త ఖాతా తెరుస్తారని, అలాంటి సందర్భాలలో పాత పీఎఫ్ ఖాతాను కొత్త ఖాతాతో అనుసంధానించుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల అప్పటి వరకు మీ ఖాతాలో జమ అయిన మొత్తంపై వడ్డీ పొందవచ్చని తెలిపారు. ఈ అనుసంధానం చేయకపోతే వడ్డీ పొందలేరని హెచ్చరిస్తున్నారు. పీఎఫ్ ఖాతాకు సంబంధించిన నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని నిపుణులు చెప్పారు.

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ కార్పొరేషన్ (ఈపీఎఫ్ వో) పీఎఫ్ ఖాతాలను రెండు వర్గాలుగా విభజించింది. యాక్టివ్, ఇన్ యాక్టివ్.. క్రమం తప్పకుండా నెలనెలా పీఎఫ్ లో నిర్ణీత మొత్తం జమ అవుతుంటే అది యాక్టివ్ ఖాతా.. మూడేళ్లకు పైగా ఎలాంటి మొత్తం జమ కాని ఖాతాలను ఇన్ యాక్టివ్ ఖాతాలుగా పరిగణిస్తుందని వివరించారు.

EPFO
employee
provident fund
job
pf interest
  • Loading...

More Telugu News