UP Warriorz: డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు తొలి ఓటమి రుచిచూపిన వారియర్స్

UP Warriorz halts Mumbai Indians winning streak in WPL
  • వరుసగా 5 మ్యాచ్ ల్లో గెలిచిన ముంబయి ఇండియన్స్
  • నేడు యూపీ వారియర్స్ చేతిలో ఓటమి
  • తొలుత 127 పరుగులు చేసిన ముంబయి
  • మరో 3 బంతులు మిగిలుండగానే జయభేరి మోగించిన వారియర్స్
వరుసగా ఐదు విజయాలతో డబ్ల్యూపీఎల్ లో ఊపుమీదున్న ముంబయి ఇండియన్స్ కు టోర్నీలో తొలి ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబయికి యూపీ వారియర్స్ అడ్డుకట్ట వేశారు. ఇవాళ జరిగిన మ్యాచ్ లో వారియర్స్... ముంబయి ఇండియన్స్ పై 5 వికెట్ల తేడాతో నెగ్గారు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి విజయభేరి మోగించారు. 

ఓ దశలో వారియర్స్ 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా, తహ్లియా మెక్ గ్రాత్ (38), గ్రేస్ హారిస్ (39) కీలక భాగస్వామ్యంతో జట్టును గెలుపు బాటలో నిలిపారు. వీరిద్దరూ అవుటైన తర్వాత సోఫీ ఎక్సెల్ స్టోన్ (16 నాటౌట్), దీప్తి శర్మ (13 నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు. ముంబయి బౌలర్లలో అమేలియా కెర్ 2, నాట్ షివర్ 1, హేలీ మాథ్యూస్ 1, ఇస్సీ వాంగ్ 1 వికెట్ తీశారు.
UP Warriorz
Mumbai Indians
WPL

More Telugu News