UP Warriorz: ముంబయి ఇండియన్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన వారియర్స్ బౌలర్లు

UP Warriorz restricts Mumbai Indians for a low score
  • డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తో యూపీ వారియర్స్ ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వారియర్స్
  • 20 ఓవర్లలో 127 పరుగులకు ముంబయి ఇండియన్స్ ఆలౌట్
డబ్ల్యూపీఎల్ లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న ముంబయి ఇండియన్స్ నేడు యూపీ వారియర్స్ తో మ్యాచ్ లో స్వల్ప స్కోరుతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ వారియర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబయిని కుప్పకూల్చారు. 

ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్సెల్ స్టోన్ 3, రాజేశ్వరి గైక్వాడ్ 2, దీప్తి శర్మ 2, అంజలి శ్రావణి 1 వికెట్ తీశారు. ముంబయి ఇన్నింగ్స్ లో హేలీ మాథ్యూస్ 35, ఇస్సీ వాంగ్ 32, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 25 పరుగులు చేశారు.
UP Warriorz
Mumbai Indians
WPL

More Telugu News