Suryanarayana: ప్రభుత్వ సమావేశాలకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఉద్యోగుల సంఘాన్ని కూడా పిలవండి: ఏపీ హైకోర్టు

AP HC orders govt to call Suryanarayana for meetings
  • మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు ఏపీ ఉద్యోగుల సంఘంకు అందని ఆహ్వానం
  • తమను ఆహ్వానించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సూర్యనారాయణ పిటిషన్
  • సూర్యనారాయణ వాదనలతో ఏకీభవించిన కోర్టు  
ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు నిర్వహించే సమావేశాలకు సూర్యనారాయణ ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. 

అయితే ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించలేదు. దీంతో, సూర్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చర్చలకు తనను ఆహ్వానించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీంతో సూర్యనారాయణ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కూడా చర్చలకు ఆహ్వానించాలని ఆదేశించింది.
Suryanarayana
AP High Court

More Telugu News