Asus: ఆసుస్ నుంచి జెన్ బుక్, వివో బుక్ ల్యాప్ టాప్ లు

Asus launches new ZenBook VivoBook laptops in India price starts at Rs 42990
  • ఏఎండీ రైజన్ 7000 సీపీయూ తో విడుదల
  • రూ.43,000 నుంచి ధరలు ప్రారంభం
  • ఒక్కో మోడల్ లో ఒకటికి మించిన వేరియంట్లు
ఆసుస్ జెన్ బుక్, వివోబుక్ సిరీస్ లో అత్యాధునిక ల్యాప్ టాప్ లను విడుదల చేసింది. ఎఎండీ రైజర్ 7000 చిప్ సెట్ తో తీసుకొచ్చిన వీటి ధరలు రూ.43వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి.

జెన్ బుక్ 14 ఓఎల్ఈడీ
దీని బరువు 1.39 కిలోలు. పూర్తి మెటల్ డిజైన్ తో ఉంటుంది. ఏఎండీ రైజెన్ 7000 సిరీస్ సీపీయూతో వస్తుంది. 16.9 ఎంఎం మందంతో ఉంటుంది. 1టీబీ ఎస్ఎస్డీ, 16జీబీ ర్యామ్ కాన్ఫిగరేషన్ తో ఉంటుంది. డిస్ ప్లే 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. జేడ్ బ్లాక్ రంగులో లభిస్తుంది. దీని  ధర రూ.89.990. ఓఎల్ఈడీ డిస్ ప్లే వద్దనుకుంటే, ఐపీఎస్ డిస్ ప్లేతోనూ లభిస్తుంది. 

వివో బుక్ గో 14
ఇది కూడా ఏఎండీ రైజన్ 7020 చిప్ సెట్ తో వస్తుంది. బరువు 1.38 కిలోలతో ఉంటుంది. 17.9 ఎంఎం మందంతో ఉంటుంది. 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీతో వస్తుంది. ఐపీఎస్ 14 అంగుళాల ఐపీఎస్ నానో ఎడ్జ్ స్క్రీన్ తో, 250 నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. మిక్స్ డ్ బ్లాక్, కూల్ సిల్వర్, గ్రే గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. దీని ఆరంభ ధర రూ.42,990. ఇందులోనే హై ఎండ్ మోడల్ ధర రూ.56,990. 

ఇవి కాకుండా వివోబుక్ గో 15, గో 15 ఓఎల్ఈడీ (ధరలు రూ.50,990 నుంచి), వివో బుక్ 14 ఓఎల్ఈడీ, 15 ఓఎల్ఈడీ, 16 (ధరలు రూ.67,990 నుంచి), వివోబుక్ 15ఎక్స్ ఎల్ఈడీ (రూ.66,990 నుంచి మొదలు), వివోబుక్ ఎస్14 ఫ్లిప్ (రూ.66,990 నుంచి) ను కూడా విడుదల చేసింది. 

Asus
launches
ZenBook
VivoBook
laptops

More Telugu News