Avinash Reddy: వివేకా కేసు: ముగిసిన అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ

CBI questions Avinash Reddy for the fourth time in Viveka murder case

  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
  • ఇప్పటికే మూడు సార్లు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ
  • ఇవాళ నాలుగోసారి విచారణ
  • దాదాపు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన వైనం

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే మూడు సార్లు సీబీఐ ఎదుట విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నేడు నాలుగో దఫా విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ సారథ్యంలో విచారణ కొనసాగింది. 

వివేకా హత్య కేసుకు సంబంధించిన పలు అంశాలపై సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు అవినాశ్ రెడ్డిపై సీబీఐ విచారణ కొనసాగింది.

Avinash Reddy
CBI
Viveka Murder Case
YSRCP
  • Loading...

More Telugu News