'రంగ మార్తాండ' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Ranga Marthanda lyrical song released
  • కృష్ణవంశీ నుంచి వస్తున్న 'రంగ మార్తాండ'
  • ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  • ప్రకాశ్ రాజ్ సరసన నటించిన రమ్యకృష్ణ 
  • రాహుల్ సిప్లి గంజ్ కి జోడీగా శివాత్మిక
ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన 'రంగమార్తాండ' విడుదలకు ముస్తాబవుతోంది. కాలెపు మధు - వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. రాహుల్ సిప్లి గంజ్ - శివాత్మిక కూడా జంటగా నటించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 

'పొదల పొదల గట్ల నడుమ లగోరంగ లగోరే ... పొడుస్తుంటే చందమామ లగోరంగ లగోరే' అంటూ ఈ పాట సాగుతోంది. ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. రాహుల్ సిప్లి గంజ్ ఈ పాటను ఆలపించాడు. నేను అనే అహంభావాన్ని ... నాది అనే స్వార్థాన్ని విడిచిపెట్టి చూడు, జీవితం చాలా అందంగా కనిపిస్తుంది" అనే అర్థంలో ఈ పాట సాగుతోంది.

టైటిల్ ను బట్టే ఇది ఒక నాటకరంగానికి చెందిన వ్యక్తి చుట్టూ తిరిగే కథ అనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన సీతారామశాస్త్రి పాట సాహిత్యం పరంగా పాప్యులర్ అయింది. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి.     

Go Back to Shorts
Prakash Raj
Ramyakrishna
Brahmanandam

More Telugu News