Indian Railways: లగేజ్ ఎక్కువుంటే ఫైన్.. ప్రయాణికులకు రైల్వే కొత్త రూల్స్

Indian railways issues new luggage rules to passengers

  • ఫస్ట్ క్లాస్ ఏసీలో 70 కేజీల లగేజి వరకు అనుమతి
  • సెకండ్ క్లాస్ లో 50 కేజీలు, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ లలో 40 కేజీలే
  • పరిమితికి మించి లగేజీ తీసుకెళితే జరిమానా తప్పదని హెచ్చరిక

రైలు ప్రయాణాలకు సంబంధించి ఇప్పటి వరకు లగేజీ బరువుపై ఎలాంటి టెన్షన్ లేదు. ప్రయాణికులు ఎంత లగేజీ తీసుకెళ్లినా అధికారులు అభ్యంతరం పెట్టేవారు కాదు. ఇకపై మాత్రం ఇలా కుదరదని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణించే తరగతిని బట్టి ఒక్కో ప్రయాణికుడు తీసుకెళ్లే లగేజీపై పరిమితి విధించింది. ఈ పరిమితి దాటి లగేజీని తీసుకెళితే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. విమాన ప్రయాణాల తరహాలోనే అదనపు లగేజీకి ఛార్జి చెల్లించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అధిక లగేజీతో ప్రయాణించొద్దని, అవసరమైతే లగేజీ పార్శిల్ సర్వీసును ఉపయోగించుకోవాలని రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

ఎవరెవరు ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చంటే..
  • ఫస్ట్ క్లాస్‌ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని తమతో ఫ్రీగా తీసుకెళ్లవచ్చు.
  • సెకండ్‌ క్లాస్‌ ఏసీలో 50 కిలోలు, థార్డ్‌ క్లాస్‌ ఏసీ స్లీపర్, ఏసీ చైర్ కార్ క్లాస్‌లలో 40 కిలోల వరకు లగేజీని ఉచితంగా వెంట తీసుకెళ్లవచ్చు. 
  • సెకండ్ క్లాస్‌లో 25 కిలోల లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ పరిమితి దాటితే రూ.30లు లగేజీ ఛార్జీ చెల్లించాలి.
  • బుక్‌ చేసుకోకుండా అదనపు లగేజీతో ప్రయాణించే వారికి బ్యాగేజీ విలువకు ఆరు రెట్లు జరిమానా విధిస్తామని రైల్వే హెచ్చరించింది.

  • Loading...

More Telugu News