Atchannaidu: వీళ్లు ఎంతకైనా దిగజారతారు: వైసీపీ నేతలపై అచ్చెన్న ఫైర్ 

  • వివేకా హత్య విషయంలో వైసీపీ తీరుపై మండిపడిన అచ్చెన్నాయుడు
  • నమ్మించి తడిగుడ్డతో గొంతు కోస్తారని ఆరోపణ
  • నీచులు అంటూ ఘాటు విమర్శలు
Kinjarapu Atchannaidu fires on AP Govt

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో సోషల్ మీడియా వేదికగా వైసీపీని విమర్శించారు. ‘‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా! అన్నట్లు నీచులందు వైసీపీ నీచులు వేరయా! రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే నీచులు, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే రకాలు వీళ్లు’’ అని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.

‘రాజకీయం కోసం ఎంతకైనా దిగజారే నీచులు’ పేరుతో పోస్టర్ ను కూడా ట్వీట్ చేశారు. గతంలో ‘వివేకా మర్డర్ వెనుక బాబు మాస్టర్ స్కెచ్’ అని, తాజాగా ‘రెండో భార్య వారసుల వివాదం వల్లే వివేకా బలయ్యారు. ఆస్తుల పంపకం అంశంలోనే వివేకా ప్రాణాలు కోల్పోయారు’ అని వైసీపీ ట్వీట్ చేయడాన్ని అందులో ప్రస్తావించారు.

అప్పుడు చంద్రబాబు చంపారని ఆరోపించారని, ఇప్పుడు వివేకా కూతురే చంపిందని చెబుతున్నారని మండిపడ్డారు. ‘జగన్ పని అయిపోయింది’.. ‘అబ్బాయ్ కిల్డ్ బాబాయ్’.. ‘సైకో పోవాలి సైకిల్ రావాలి’.. ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ హ్యాష్ ట్యాగ్ లను అచ్చెన్నాయుడు జతచేశారు.

More Telugu News