WhatsApp: చెప్పినప్పుడు డిలీట్ అయ్యే సరికొత్త వాట్సాప్ గ్రూప్

WhatsApp groups may soon get expiration date

  • ఐఫోన్ యూజర్లపై పరీక్షిస్తున్న వాట్సాప్
  • త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం
  • గ్రూప్ సెట్టింగ్స్ లో నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు

వాట్సాప్ అతి త్వరలో కొత్త ఫీచర్ ను అందరికీ అందించనుంది. ఎక్స్ పైరింగ్ గ్రూప్స్ పేరుతో ఇది వస్తోంది. గ్రూప్ ను క్రియేట్ చేసి అది ఎప్పుడు డిలీట్ అవ్వాలో ముందుగానే అడ్మిన్ నిర్ణయించుకోవచ్చు. సెట్టింగ్స్ లో తేదీని ఇస్తే, అదే రోజు గ్రూప్ డిలీట్ అయిపోతుంది. 

ఎక్స్ పైరింగ్ గ్రూప్స్ కింద యూజర్లు ఒక రోజు, ఒక వారం, లేదంటే ఫలానా తేదీని ఎంపిక చేసుకోవచ్చు. పుట్టిన రోజు, పెళ్లి రోజు తదితర ప్రత్యేక సందర్భాలు, కార్యక్రమాలు, అవసరాల కోసం గ్రూపులు ఏర్పాటు చేసే వారు ఎక్స్ పైరింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే చాలు. ఈ ఫీచర్ తో కూడిన వాట్సాప్ అప్లికేషన్ ను ప్రస్తుతం ఐఫోన్ యూజర్లపై పరీక్షిస్తున్నట్టు సమాచారం. 

పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. గ్రూప్ క్రియేట్ చేసిన అనంతరం సెట్టింగ్స్ లో ఎక్స్ పైరింగ్ గ్రూప్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ రోజు, వారం, కస్టమ్ డేట్, రిమూవ్ ఎక్స్ పైరేషన్ డే అనే ఫీచర్లు కనిపిస్తాయి. అక్కడ కావాల్సినది ఎంపిక చేసుకోవచ్చు. ఇది గ్రూప్ అడ్మిన్లకేనా లేక.. యూజర్లు సైతం గ్రూపులో డిలీట్ ఆప్షన్ (తమ వరకు) ఇచ్చుకోవచ్చా? అన్న దానిపై స్పష్టత లేదు.

WhatsApp
groups
whatsapp expiring
new feature
expiration date
  • Loading...

More Telugu News