Instagram: ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టా సేవలకు అంతరాయం

Instagram Down For Thousands Of Users Globally

  • యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో నిలిచిన సేవలు
  • డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ వెల్లడి
  • ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయని మెటా

ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఇన్ స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అమెరికాతో పాటు యూకే, ఆస్ట్రేలియాలో ఇన్ స్టా నిలిచిపోయిందంటూ వేలాదిగా ఖాతాదారులు ఫిర్యాదు చేస్తున్నట్లు డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ వెల్లడించింది. అమెరికాలోని ఇన్ స్టా యూజర్లకు ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపింది. అమెరికా వ్యాప్తంగా దాదాపు 46 వేల మందికి పైగా యూజర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారని వివరించింది.

అయితే, ఈ అంతరాయానికి కారణమేంటనే విషయంపై ఇప్పటి వరకు ఇన్ స్టా మాతృ సంస్థ మెటా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదని తెలిపింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ ఓ కథనం వెలువరించింది.

Instagram
services interupted
USA
UK
Australia
downdetector
  • Loading...

More Telugu News