Ponnala Lakshmaiah: నిజాంసాగర్ నీటితో కళకళలాడుతోందని చెప్పడానికి సిగ్గుండాలి: పొన్నాల

Ponnala Lakshamaiah take a swipe at KTR

  • కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారన్న పొన్నాల
  • మాటలతో పబ్బం గడుపుకునే ప్రభుత్వం ఇదని వ్యాఖ్యలు
  • రాష్ట్రంలో రిజర్వాయర్లన్నీ ఖాళీగానే ఉన్నాయని వెల్లడి

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మాటలతోనే పబ్బం గడుపుకునే ప్రభుత్వం ఇది అని వ్యాఖ్యానించారు. 

నిజాంసాగర్ నీటితో కళకళలాడుతోందని అనడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి నీటి లింకు ఇంకా పూర్తి కాలేదు... అప్పుడే నీళ్లు ఎలా వచ్చాయని నిలదీశారు. రాష్ట్రంలో రిజర్వాయర్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయని, నీటితో నింపే పరిస్థితి లేదని పొన్నాల పేర్కొన్నారు. 71 లక్షల ఉద్యోగాలు అన్నారు... ఇప్పటికీ చర్యలు లేవు అని తెలిపారు. రాష్ట్రానికి ఎన్ని కొత్త కంపెనీలు వచ్చాయో బయటపెట్టాలని, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Ponnala Lakshmaiah
KTR
Nizam Sagar
Congress
BRS
Telangana
  • Loading...

More Telugu News