maternity leave: విద్యార్థినులకు 6 నెలల మెటర్నిటీ లీవ్.. కేరళ యూనివర్సిటీ ప్రకటన

Kerala University students to get six months maternity break

  • సెలవులు పూర్తయ్యాక నేరుగా క్లాసులకు హాజరవ్వొచ్చని వెల్లడి
  • మరోమారు అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలేదని వివరణ
  • కొచ్చిన్ యూనివర్సిటీ, కేరళ హెల్త్ సైన్సెన్ వర్సిటీల్లోనూ మెటర్నిటీ లీవ్

యూనివర్సిటీ ఆఫ్ కేరళ కూడా విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ ప్రకటించింది. వర్సిటీలో చదువుతున్న విద్యార్థినులు ఆరు నెలల దాకా మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ సౌకర్యం పద్దెనిమిదేళ్లు నిండిన విద్యార్థినులకేనని తేల్చిచెప్పింది. ఈ సెలవులు పూర్తయిన తర్వాత నేరుగా క్లాసులకు హాజరు కావొచ్చని, మరోమారు అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలేదని స్సష్టం చేసింది. సంబంధిత అధికారులు విద్యార్థినులు తీసుకున్న లీవ్, మెడికల్ రిపోర్టులు పరిశీలించి క్లాసులకు అనుమతిస్తారని పేర్కొంది. ఈమేరకు యూనివర్సిటీ ఆఫ్ కేరళ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కిందటి వారం కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 60 రోజుల పాటు సెలవు తీసుకోవచ్చని తెలిపింది. రాష్ట్రంలో విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ ప్రకటించిన తొలి యూనివర్సిటీ ఇదేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కూడా విద్యార్థినులకు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవ్ తీసుకునే సదుపాయం కల్పించాయి.

maternity leave
kerala universities
six months
cochin versity
girl students
  • Loading...

More Telugu News