Raviteja: సీతను తీసుకెళ్లాలంటే సముద్రాన్ని దాటితే సరిపోదు: ' రావణాసుర' టీజర్ డైలాగ్

Ravanasura movie teaser released
  • 'రావణాసుర'గా రవితేజ
  • ఆయన సరసన ఐదుగురు హీరోయిన్లు   
  • కీలకమైన పాత్రలో సుశాంత్
  • ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదల  

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'రావణాసుర'. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి, రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. హర్షవర్దన్ రామేశ్వర్ - భీమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో హీరో తాను టార్గెట్ చేసినవారిని వరుసగా అంతం చేస్తూ వెళుతుంటాడు. ఆయన చంపే తీరు కూడా రాక్షసంగా ఉంటుంది. ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్స్ గా జయరామ్ - మురళీశర్మ కనిపిస్తున్నారు. హీరో ఎందుకు అలా మారాడనేది సస్పెన్స్.

'సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు .. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి' అనే హీరో డైలాగ్ ఈ టీజర్ కి హైలైట్. అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. దక్ష నగార్కర్ . పూజిత పొన్నాడ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. సుశాంత్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.  ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News