Maharashtra: యూట్యూబ్‌లో చూసి సొంతంగా కాన్పు చేసుకున్న బాలిక.. ఆపై శిశువును గొంతు నులిమి..!

Nagpur Teen Gives Birth After Watching Online Videos

  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
  • సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో శారీరకంగా దగ్గరైన బాలిక
  • ఆపై గర్భం దాల్చడంతో ఇంట్లోనే సొంతంగా కాన్పు
  • బిడ్డ గొంతు నులిమి పెట్టెలో దాచేసిన బాలిక

యూట్యూబ్‌లో చూస్తూ 15 ఏళ్ల బాలిక తనకు తానుగా కాన్పు చేసుకుంది. ఆపై పుట్టిన బిడ్డను గొంతు నులిమి చంపేసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆపై అది క్రమంగా పెరిగి పెద్దదైంది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు.

ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. పొట్ట పెరుగుతుండడంతో అనుమానించిన బాలిక తల్లి ప్రశ్నించగా ఏం లేదని, అనారోగ్యం వల్లే పొట్ట పెరుగుతోందని తల్లిని బురిడీ కొట్టించింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో కాన్పుకు సంబంధించిన వీడియోలను సెర్చ్ చేసి.. ఒంటరిగా కాన్పు ఎలా చేసుకోవచ్చో  తెలుసుకుంది. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని  సమయంలో ఆడబిడ్డకు బాలిక జన్మనిచ్చింది. ఆ వెంటనే ఆ శిశువును గొంతు నులిమి చంపేసింది. 

ఆ తర్వాత ఇంట్లోని పెట్టెలో శిశువు మృతదేహాన్ని దాచిపెట్టింది. తల్లి బయటకు వచ్చిన తర్వాత కుమార్తె నీరసంగా కనిపించడంతో గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు, సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి చేరుకుని శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Maharashtra
Nagpur
Girl
Youtube
  • Loading...

More Telugu News