Gangavva: ఇంటి నిర్మాణానికి నాగార్జున ఇచ్చిందెంతో చెప్పేసిన గంగవ్వ

Akkineni Nagarjuna Gives only 7 Lakh for my New House construction Says Gangavva

  • బిగ్ బాస్ రెమ్యూనరేషన్ వివరాలు కూడా వెల్లడి
  • ఇల్లు కట్టడానికి రూ.20 లక్షలు ఖర్చు
  • తాజా ఇంటర్వ్యూలో చెప్పిన ఫేమస్ యూట్యూబర్ గంగవ్వ

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొందరికి.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమైన వ్యక్తి గంగవ్వ. యూట్యూబ్ వీడియోలలో తన సహజ నటనతో ఆవిడ రెండు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సెలబ్రెటీగా మారిన గంగవ్వ ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ వివరాలు, నాగార్జున తనకు చేసిన ఆర్థిక సాయాన్ని ఇందులో తెలిపారు.

బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్‌‌గా వెళ్లిన గంగవ్వ మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. దాదాపు ఐదు వారాల పాటు హౌస్ లో ఉన్నారు. బిగ్ బాస్ హౌసులో తినడం పడుకోవడం తప్ప వేరే పని లేకపోవడంతో ఇబ్బంది పడ్డట్లు చెప్పారావిడ. హౌస్ లోపలికి పంపించే ముందు 15 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచడమూ తనను ఇబ్బందికి గురిచేసిందన్నారు. దీంతో మధ్యలోనే ఎలిమినేషన్ రూపంలో బయటకు వచ్చేశానని చెప్పారు. ఐదు వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు బిగ్ బాస్ వాళ్లు తనకు రూ.10 లక్షలు ఇచ్చారని గంగవ్వ తెలిపారు.

ఎలిమినేషన్ వేదికపై నాగార్జునతో మాట్లాడుతూ.. ఇల్లు కట్టుకోవాలనే కోరికను గంగవ్వ వెలిబుచ్చారు. దీంతో బిగ్ బాస్ ఇచ్చే రెమ్యూనరేషన్ కాకుండా తాను వ్యక్తిగతంగా గంగవ్వకు సాయం చేస్తానని నాగార్జున ప్రకటించారు. అన్నట్లుగానే నాగార్జున సాయం చేయడం, బిగ్ బాస్ వాళ్లు ఇచ్చిన డబ్బుతో గంగవ్వ ఇల్లు పూర్తయింది. అయితే, గంగవ్వ ఇంటికోసం నాగార్జున ఎంతిచ్చారనే విషయం ఇప్పటి వరకూ బయటపెట్టలేదు. అటు నాగార్జున కానీ, ఇటు గంగవ్వ కానీ ఈ విషయంలో నోరు మెదపలేదు. తాజాగా, నాగార్జున తనకు ఇచ్చిన సొమ్ము ఎంతో గంగవ్వ చెప్పేశారు. రూ. 7 లక్షలు ఇచ్చారని వెల్లడించారు. బిగ్ బాస్, హీరో నాగార్జున సాయంతో తన సొంతింటి కల నెరవేరిందని గంగవ్వ ఆనందం వ్యక్తం చేశారు.

Gangavva
bigboss
Nagarjuna
youtube
gangavva house
  • Loading...

More Telugu News