Allu Arjun: మా కాంబినేషన్లో వచ్చే సినిమా చాలాకాలం గుర్తుండిపోయేలా ఉంటుంది: అల్లు అర్జున్

  • సందీప్ వంగాతో అల్లు అర్జున్ చిత్రం
  • టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా పాన్ ఇండియా మూవీ
  • ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నానన్న బన్నీ
Allu Arjun responds over Sandeep Vanga movie

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కలయికలో పాన్ ఇండియా చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాత. దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో, హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. 

"ఈ కాంబినేషన్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నాను. సందీప్ వంగా మ్యాజిక్ ఏంటో గానీ, ఎక్కడో నన్ను బలంగా తాకింది. మా కాంబినేషన్ లో వచ్చే చిత్రం చాలాకాలం గుర్తుండిపోయేలా ఉంటుందని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఈ మ్యాజికల్ ప్రాజెక్టును ఖరారు చేసిన నిర్మాత భూషణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు అల్లు అర్జున్ వెల్లడించారు. 

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో గానీ, సందీప్ వంగాతో చిత్రం గానీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.

More Telugu News