Green India Challenge: ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్.. స్వీకరించిన నమ్రతా శిరోద్కర్

namrata shirodkar accepts the green india challenge

  • మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖులకు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరిన ఎంపీ సంతోష్
  • తనను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన నమ్రత
  • మహిళలు అందరూ మొక్కలు నాటాలని కోరుతున్నానని వెల్లడి

బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.. రాజకీయాల్లో కన్నా మొక్కలు నాటడంలోను, నాటించడంలోనే బిజీగా ఉంటారు. అప్పడప్పుడూ సెలబ్రిటీలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లు విసురుతుంటారు. అలా ఎంతో మందితో మొక్కలు నాటించారు. తాజాగా ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ఎంపీ సంతోష్ విసిరారు.

వీరిలో సినీ నటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను నమ్రత కూడా స్వీకరించారు. దీంతో ఆమెకు సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. మన చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడంలో సహాయపడటానికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

అంతకుముందు గ్రీన్ ఇండియా చాలెంజ్ కు తనను నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు నమ్రత ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని కోరుతున్నానని చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

Green India Challenge
namrata shirodkar
Joginapally Santosh Kumar
world women's day
  • Loading...

More Telugu News