Balakrishna: బాలయ్య 108వ సినిమాలో శ్రీముఖి?

Sri Mukhi in Balakrishna Movie
  • బుల్లితెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన శ్రీముఖి
  • యూత్ లో ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ 
  • 'బోళా శంకర్'లో మెరవనున్న శ్రీముఖి 
  • బాలయ్య సినిమాలో శ్రీలీలకి ఫ్రెండ్ గా కీలకమైన రోల్ 

బాలయ్య 107వ సినిమాగా వచ్చిన 'వీరసింహారెడ్డి' సంచలన విజయాన్ని సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుందనేది టాక్. 

బుల్లితెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. ఆ మధ్య ఆమె కొన్ని సినిమాల్లో మెరిసింది కూడా. కానీ ఆ తరువాత టీవీ షోస్ పైనే దృష్టిపెడుతూ వచ్చింది. గ్లామర్ పరంగా ఒక స్టార్ హీరోయిన్ కి ఉండవలసిన క్రేజ్ ఆమెకి ఉంది. చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో ఆమె ఓ ముఖ్యమైన పాత్రను పోషించనుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది. 

ఇక తాజాగా బాలయ్య 108వ సినిమా కోసం కూడా ఆమెను తీసుకున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు. మొదటి నుంచి చివరివరకూ ఈ పాత్ర తెరపై కనిపిస్తుందని చెబుతున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.   

  • Loading...

More Telugu News