Rajinikanth: రజనీకాంత్ 170వ సినిమా అప్ డేట్ వచ్చేసింది.. వివరాలు ఇవిగో!

Superstar Rajanikanth teaming up with TJ Gnanavel for Thalaivar 170

  • సూపర్ స్టార్ రజనీ కొత్త సినిమాను తెరకెక్కించనున్న ‘జైభీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్
  • ట్విట్టర్ లో ప్రకటించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ
  • అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు వెల్లడి
  • త్వరలోనే షూటింగ్ ప్రారంభం.. వచ్చే ఏడాది విడుదల!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా అప్ డేట్ వచ్చేసింది. ‘జైభీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు ‘తలైవర్ 170’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. 

లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాస్కరన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ట్విట్టర్ లో ఈ ప్రకటన చేశారు. రజనీకాంత్ తో సుభాస్కరన్ ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. అలాగే ‘రాక్ స్టార్’ అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని, 2024లో విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులను కూడా ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం.

గతంలో రజనీకాంత్ తో 2.0, దర్బార్ సినిమాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ నటిస్తున్నారు. అలాగే తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ సినిమా చేయనున్నారు.

Rajinikanth
TJ Gnanavel
Thalaivar 170
Lyca Productions
Anirudh
Jailer
super star
  • Loading...

More Telugu News