Hekani Jakhalu: చరిత్ర సృష్టించిన హెకానీ జఖాలూ... నాగాలాండ్ అసెంబ్లీలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యే

Hekani Jakhalu creates history as a woman MLA enters into Nagaland assembly for the fist time

  • నాగాలాండ్ కు రాష్ట్ర హోదా లభించి 60 ఏళ్లు
  • అసెంబ్లీలో ఇప్పటివరకు మహిళా ప్రాతినిధ్యం లేని వైనం
  • దిమాపూర్-3 నియోజకవర్గం నుంచి హెకానీ జఖాలూ

నాగాలాండ్ కు రాష్ట్ర హోదా లభించి 60 ఏళ్లు. అప్పటి నుంచి నాగాలాండ్ అసెంబ్లీలో మహిళలకు ప్రాతినిధ్యం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. అయితే, తాజాగా జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ అభ్యర్థి హెకానీ జఖాలూ విజయం సాధించింది. తద్వారా నాగాలాండ్ అసెంబ్లీలో అడుగుపెడుతున్న తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించింది. 

ఈ ఎన్నికల్లో జఖాలూ దిమాపూర్-3 నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 183 మంది అభ్యర్థులో బరిలో దిగగా, వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఆ నలుగురిలో మొదటగా విజయం సాధించింది హెకానీ జఖాలూ ఒక్కతే. 48 ఏళ్ల జఖాలూ వృత్తి రీత్యా న్యాయవాది. మరో మహిళా అభ్యర్థి సల్హౌటుయోనువో క్రూసే ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు. 

నేడు నాగాలాండ్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా... ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించి, 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోసారి ఎన్డీపీపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తాజా ఫలితాల సరళి చెబుతోంది.

Hekani Jakhalu
MLA
Woman
NDPP
Assembly
Nagaland
  • Loading...

More Telugu News