Cooking Gas: ఈసారి భారీగా బాదేశారు.. వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 50 పెంపు

Cooking Gas Cylinder Price Hiked By Rs 50 affect form today

  • వాణిజ్య సిలిండర్‌పై రూ. 350.50 పెంపు
  • హైదరాబాద్‌లో రూ. 1,155కు చేరుకున్న డొమెస్టిక్ సిలిండర్ ధర
  • వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఈ ఏడాది ఇది రెండోసారి

వంట గ్యాస్ ధరలు మరోమారు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 50, వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ. 350.50 పెంచినట్టు పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. 

నిన్నటి వరకు హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రూ. 1,105 ఉండగా తాజా పెంపుతో అది రూ. 1,155కు చేరుకుంది. ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,103కు పెరగ్గా వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,119.50కి చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. జనవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ. 25 పెరిగింది.

Cooking Gas
Gas Cylinder
Gas Cylinder Price Hike
  • Loading...

More Telugu News