Balakrishna: తెలంగాణ యువకుడిగా బాలయ్య .. తెలంగాణ యాసలో డైలాగ్స్!

Balakrishna and Anil Ravipudi Movie Update

  • 'వీరసింహారెడ్డి'తో హిట్ కొట్టిన బాలయ్య 
  • తరువాత సినిమాకి జరుగుతున్న సన్నాహాలు 
  • దర్శకత్వం వహించనున్న అనిల్ రావిపూడి
  • డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న బాలయ్య 
  • బాలకృష్ణ నటిస్తున్న 108వ సినిమా

బాలకృష్ణ 107వ సినిమాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'వీరసింహారెడ్డి' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆయన కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత సినిమాను ఆయన అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. 

షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించనున్నారు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు. ఇంతవరకూ తెరపై ఎక్కువగా రాయలసీమ మాండలికంలో డైలాగ్స్ చెబుతూ వచ్చిన ఆయన, తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. 

ఈ సినిమాలో బాలయ్య 40 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తిగా .. జైల్లో 14 ఏళ్ల శిక్షను అనుభవించి తిరిగి వచ్చిన 60 ఏళ్ల వ్యక్తిగా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ రావిపూడి కామెడీ టచ్ కొంతమాత్రమే ఉంటుందట. బాలయ్య మార్క్ యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. 

Balakrishna
Anil Ravipudi
Tollywood
  • Loading...

More Telugu News