T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్... దక్షిణాఫ్రికా టార్గెట్ 157 రన్స్

  • నేడు కేప్ టౌన్ లో ఫైనల్ మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు
  • లక్ష్యచేదనలో 10 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులు చేసిన సఫారీలు
Australia women set South Africa 157 runs target in T20 World Cup final

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. నేడు ఆతిథ్య దక్షిణాఫ్రికా, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. 

సఫారీ బౌలర్లు ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ను సమర్థంగా కట్టడి చేశారు. భారీ స్కోరు సాధించకుండా నిలువరించారు. షబ్నిమ్ ఇస్మాయిల్ 2, మరిజానే కాప్ 2, ఎంలబా 1, క్లో ట్రయోన్ 1 వికెట్ తీశారు. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ బెత్ మూనీ అజేయంగా 74 పరుగులు చేసింది. ఆష్లే గార్డనర్ 29, వికెట్ కీపర్ అలిస్సా హీలీ 18 పరుగులు చేశారు. 

అనంతరం, 157 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 60 బంతుల్లో 105 పరుగులు చేయాలి. క్రీజులో ఓపెనర్ లారా ఓల్వార్ట్ 28, కెప్టెన్ సున్ లూస్ 1 పరుగుతో ఉన్నారు.

More Telugu News