sam: గుర్రపు స్వారీ చేస్తోన్న సమంత.. ఫోటో వైరల్..

Samantha Shares Horse Riding Photo in Her instagram

  • ‘ది బ్యూటీ అండ్ ది బీస్ట్.. యూ ఆర్ బోత్’ అంటూ ఇన్ స్టాలో ఫోటో షేర్ చేసిన సామ్
  • సిటాడెల్ షూటింగ్ లో బిజీగా ఉన్న హీరోయిన్
  • విడుదలకు సిద్ధమైన శాకుంతలం సినిమా

అనారోగ్యం కారణంగా కొంతకాలం పాటు ఇంటికే పరిమితమైన హీరోయిన్ సమంత కోలుకుని షూటింగ్ లకు హాజరవుతున్నారు. మయోసైటిస్ సమస్యకు ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. కాస్త కోలుకోవడంతో తిరిగి తన ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టారు. వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సిటాడెల్ సిరీస్ షూటింగ్ సెట్ లో సమంత జాయిన్ అయ్యారు. త్వరలోనే ఖుషి సినిమా షూటింగ్ కూ హాజరుకానున్నట్లు ప్రకటించడంతో సామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత తన ఇన్ స్టాలో లెటేస్ట్ ఫోటో షేర్ చేశారు. గుర్రంపై స్వారీ చేస్తున్న ఫొటోకు ‘ది బ్యూటీ అండ్ ది బీస్ట్.. యూఆర్ బోత్’ అనే క్యాప్షన్ జోడించి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.

ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ రాశి ఖన్నా, ప్రగ్యా జైస్వాల్ కూడా స్పందించారు. సమంత ఫొటోకు లవ్ అండ్ ఫైర్ ఎమోజీలను జత చేశారు. ప్రస్తుతం సామ్ ఖుషి, సిటాడెల్ సినిమాలలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాకు శివ నిర్వాణ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం సినిమా త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే!

sam
riding
Instagram
Photo
Samantha
shakunthalam
khushi
citadel
  • Loading...

More Telugu News