Payal Rajput: రామచంద్రపురంలో ‘మంగళవారం’ సినిమా షూటింగ్.. ప్రజల అభిమానానికి ఫిదా అయ్యానన్న పాయల్ రాజ్‌పుత్

  • కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణంలో షూటింగ్
  • తనకు క్రేజ్ వచ్చింది తెలుగు సినిమాలతోనేనన్న పాయల్
  • కాలేజీ రోజులు గుర్తొచ్చాయన్న నటి
Tollywood actress Payal Rajput impressed by Godavari people hospitality

గోదావరి ప్రజల అభిమానం తనను కదిలించివేసిందని ‘ఆర్ఎక్స్ 100’ నటి పాయల్ రాజ్‌పుత్ అన్నారు. ఆమె నటిస్తున్న ‘మంగళవారం’ సినిమా గత మూడు రోజులుగా కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణంలో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో ఆమె మాట్లాడుతూ.. దర్శకుడు అజయ్ భూపతితో మరోమారు చేస్తున్న ఈ సినిమా చాలా బాగుంటుందని అన్నారు. తాను ఎన్నో సినిమాలు చేసినా క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాలతోనేనని చెప్పుకొచ్చారు. రామచంద్రపురం కాలేజీలో సినిమా చిత్రీకరణ సందర్భంగా తాను చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. 

తనది ముంబై అయినా ఢిల్లీలోనే ఉంటున్నట్టు చెప్పారు. తాను మాస్టర్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇన్ జర్నలిజం చేసినట్టు తెలిపారు. కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతుంటే కళాశాల రోజులను మిస్ అయిన భావన కలుగుతోందన్నారు. బాలీవుడ్‌ నటి కరీనా కపూర్ అంటే ఎంతో ఇష్టమన్న పాయల్.. తెలుగులో ఆర్ఎక్స్ 100, వెంకీమామ, అనగనగా ఒక అతిథి, ఆర్డీఎక్స్ లవ్, తీస్‌మార్‌ఖాన్ వంటి చిత్రాల్లో నటించారు.

More Telugu News