Narayana: మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు

AP CID searches in Ex minister Narayana daughter houses

  • మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్ పల్లి ఇళ్లలో సోదాలు
  • ఉదయం నుంచి కొనసాగుతున్న తనిఖీలు
  • ఏ విషయంలో సోదాలను నిర్వహిస్తున్నారో వెల్లడించని అధికారులు

నారాయణ విద్యా సంస్థల అధినేత, టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ మరోసారి షాక్ ఇచ్చింది. ఆయన కుమార్తె ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాదులోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్ పల్లిలోని నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. బృందాలుగా విడిపోయిన అధికారులు తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నారాయణను మాత్రమే టార్గెట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు... ఇప్పుడు ఆయన కుమార్తె ఇళ్లలో కూడా సోదాలను ప్రారంభించడం గమనార్హం. 

ఇప్పటి వరకు నారాయణపై ఏపీ సీఐడీ అధికారులు పలు కేసులు (ఎగ్జామ్ పేపర్ లీక్, అమరావతి భూముల వ్యవహారం) పెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు, ఇప్పుడు ఏ విషయంలో నారాయణ కుమార్తె నివాసంలో సోదాలు చేస్తున్నారనే విషయాన్ని మాత్రం సీఐడీ అధికారులు వెల్లడించలేదు. అయితే, టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Narayana
Telugudesam
Daughter
AP CID
  • Loading...

More Telugu News