ChatGPT: వాట్సాప్ లో మీ బదులు చాట్ జీపీటీ చాటింగ్ 

Donot like texting Soon ChatGPT can reply to your WhatsApp texts on your behalf

  • ఫైథాన్ స్క్రిప్ట్ ను అభివృద్ధి చేసిన డానియల్ గ్రాస్
  • ఒక్కసారి వాట్సాప్ కు అనుసంధానించుకుంటే చాలు
  • మన ఆదేశాల ప్రకారం అదే చాట్ చేసేస్తుంది

వాట్సాప్ లో వచ్చే సందేశాలకు బదులిచ్చే ఓపిక కూడా లేదా? అంత బిజీగా ఉన్నారా? అయితే ఏం ఫర్వాలేదు.. చాట్ జీపీటీకి చెప్పేయండి చాలు.. అంతా అదే చూసుకుంటుంది. మీ బదులు అదే రిప్లయ్ ఇచ్చేస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్ చాట్ జీపీటీ ఇటీవల పెద్ద సంచలనంగా మారడం తెలిసిందే.

ఈ టూల్ గూగుల్ సెర్చ్ కంటే ఎంతో పవర్ ఫుల్. మనం ఏది కోరినా ఒక క్రమపద్ధతిలో సమాచారాన్ని ముందుంచుతుంది. అందుకే దీనికి ఆదరణ పెరుగుతోంది. వెబ్ బ్రౌజర్ కు అనుసంధానంగా చాట్ జీపీటీ పనిచేస్తుందని తెలుసు. వాట్సాప్ అప్లికేషన్ తో అనుసంధానించేందుకు కావాల్సిన పైథాన్ స్క్రిప్ట్ ను డెవలపర్ డానియల్ గ్రాస్ అభివృద్ధి చేశారు. ఈ స్క్రిప్ట్ సాయంతో వాట్సాప్ పై చాట్ జీపీటీని ప్రయోగించొచ్చు. 

పైథాన్ స్క్రిప్ట్ ను ఉపయోగించేందుకు వీలుగా, లాంగ్వేజ్ లైబ్రరీని ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ జీపీటీ ఫైల్ ను తెరిచి సర్వస్ డాట్ పీవై డాక్యుమెంట్ ను ఎగ్జిక్యూట్ చేయాలి. దీంతో వాట్సాప్ పై చాట్ జీపీటీ అనుసంధానిత మొదలవుతుంది. సర్వర్ నడుస్తున్న సమయంలో ‘ఈజ్’ అని టైప్ చేసి, ఎంటర్ చేయాలి. తర్వాత పైథాన్ సర్వస్ డాట్ పీవైపై క్లిక్ చేయాలి. నేను హ్యూమన్ నే అంటూ ధ్రువీకరించాలి. దీంతో వాట్సాప్ పై చాట్ జీపీటీ అందుబాటులోకి వస్తుంది.

ChatGPT
WhatsApp
chatting
automatic reply
  • Loading...

More Telugu News