JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డికి కోర్టు సమన్లు

Court sends summons to JC Prabhakar Reddy

  • తప్పుడు పత్రాలతో వాహనాలను రిజిస్టర్ చేయించారని కేసు
  • ఈ కేసులో గతంలో జేసీ, ఆయన కుమారుడు అరెస్ట్
  • ఇదే కేసులో ఈడీ విచారణ కూడా కొనసాగుతున్న వైనం

అక్రమ వాహనాల కేసు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్ రెడ్డిని వెంటాడుతోంది. ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 1వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ జేసీతో పాటు మరో 18 మందికి సమన్లను పంపింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే, తప్పుడు పత్రాలతో 154 వాహనాలను రిజిస్టర్ చేయించారని జేసీపై పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. రాజకీయ కక్షల్లో భాగంగానే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని అప్పట్లో జేసీ ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి 2020 జూన్ 13న జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మరోవైపు ఈ కేసును ఈడీ కూడా విచారిస్తోంది. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా మార్చి రిజిస్ట్రేషన్ చేశారని ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 7న జేసీని ఈడీ అధికారులు దాదాపు ఐదు గంటల సేపు విచారించారు. గడువు తీరిన వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని అభియోగాలు మోపారు.

JC Prabhakar Reddy
Telugudesam
Court Summons
  • Loading...

More Telugu News