Belllamkonda Srinivas: 'ఛత్రపతి' హిందీ రీమేక్ రిలీజ్ సమయం దగ్గర పడినట్టే!

Chathrapathi Remake Update

  • 2005లో వచ్చిన ప్రభాస్ 'ఛత్రపతి'
  • ఆ సినిమా రీమేక్ తో బాలీవుడ్ కి బెల్లంకొండ శీను 
  • దర్శకత్వం వహిస్తున్న వినాయక్ 
  • ఈ వేసవిలో విడుదల చేసే ఛాన్స్

టాలీవుడ్ లో 'అల్లుడు శీను' నుంచి 'అల్లుడు అదుర్స్' వరకూ బెల్లంకొండ శ్రీనివాస్ జోరు కొనసాగింది. హిట్ .. ఫ్లాప్ అనే విషయాలను పక్కనే పెడితే, ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో రూపొందినవే .. స్టార్ హీరోయిన్స్ తో సైతం ఐటమ్ సాంగ్స్ చేయించినవే. అలాంటి బెల్లంకొండ శీను, బాలీవుడ్ ఆడియన్స్ ను ఒకసారి పలకరించి వచ్చినట్టుగా ఉంటుందని భావించి, 'ఛత్రపతి' హిందీ రీమేక్ కోసం రంగంలోకి దిగాడు.

వినాయక్ దర్శకత్వంలో ఇలా ప్రాజెక్టును పూర్తి చేసి అలా వచ్చేద్దామని వెళ్లాడు. అయితే కారణాలేవైనా ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మొత్తానికి చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. 

తెలుగులో 2005లో రాజమౌళి దర్శకత్వంలో చేసిన 'ఛత్రపతి' .. ప్రభాస్ కెరియర్ కి చాలా హెల్ప్ అయింది. మరి ఈ సినిమా రీమేక్ బెల్లంకొండ శీనుకి ఎంత హెల్ప్ అవుతుందనేది తెలియదుగానీ, తెలుగు ఆడియన్స్ తో ఆయనకి గ్యాప్ మాత్రం బాగానే వచ్చింది. తెలుగులో ఆయన నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడితో ఉంటుందనేది చూడాలి. 
 

Belllamkonda Srinivas
VV Vinayak
Chathrapathi Ramake
  • Loading...

More Telugu News