Sania Mirza: యువతులకు సానియా మీర్జా సందేశం ఇదే..!

Sania Mirzas glorious career ends Want to tell young women donot let anybody tell you that you cant do what you want

  • అనుకున్నది సాధించాలని పిలుపు
  • ఏం చేయాలో ఇతరులకు చెప్పే అవకాశం ఇవ్వొద్దన్న సానియా
  • మీకు మీరే మద్దతుగా నిలవాలని సూచన

ప్రతిభతో టెన్నిస్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన సానియా మీర్జా యువ క్రీడాకారులకు ఆదర్శనీయం, స్ఫూర్తినీయం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. డబ్బు ఉంటే ఆట వస్తుందన్న గ్యారంటీ లేదు. టెన్నిస్ లాంటి క్రీడల్లో ప్రతిభతోనే రాణించగలరు. అలాంటి చోట సానియా మీర్జా తానేంటో నిరూపించుకుంది. మంగళవారం దుబాయిలో చివరి మ్యాచ్ తో తన కెరీర్ ను ముగించింది. అమెరికాకు చెందిన మ్యాడిసన్ కీస్ తో కలసి డబుల్స్ లో బరిలో దిగిన సానియా ఓటమితో నిష్క్రమించింది. 

36 ఏళ్ల సానియా మీర్జా భారత్ టెన్నిస్ ఖ్యాతిని విస్తరించిన వారిలో ఒకరిగా చెప్పుకోవాలి. ఆరు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలిచింది. డబుల్స్ లో ప్రపంచ నంబర్ 1 అనిపించుకుంది. సింగిల్స్ లో ప్రపంచంలో 27వ స్థానాన్ని సొంతం చేసుకుంది. తన 20 ఏళ్ల కెరీర్ ముగించిన సందర్భంగా ఆమె యువ మహిళలకు తన సందేశాన్ని ఇచ్చింది.

‘‘యువ మహిళగా జీవితంలో ఏం చేశారన్నది ముఖ్యం కాదు. కానీ, మీపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలవడం నా అదృష్టం. ఇంట్లో వారితో, బయట సమాజంతో నెగ్గుకురావాలి. మీరు సరైన దిశలోనే వెళుతున్నారని ప్రయత్నిస్తూనే సాగాలి. మీరు కోరుకున్నది చేయలేరని, కష్టమని ఎవరూ మీకు చెప్పే అవకాశం ఇవ్వకండి. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదన్నది వేరే వారు నిర్ణయించే అవకాశం ఇవ్వకండి. అయినప్పటికీ వారు ప్రయత్నిస్తుంటారు. బయటవారు ఏమి అనుకున్నా.. మీకు మీరే మద్దతుగా నిలవండి’’ అంటూ సానియా సూచించింది.

Sania Mirza
message
youth
tennis star
retires
  • Loading...

More Telugu News