Gorantla Butchaiah Chowdary: ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయాలపై దాడులు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary slams YCP

  • గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి
  • చంద్రబాబును అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న గోరంట్ల
  • ఓటమి భయంతోనే చంద్రబాబుపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కనుసన్నల్లోనే టీడీపీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబును అంతం చేసేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబుపై దాడులకు వైసీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అనపర్తి పర్యటనలో చంద్రబాబు పట్ల దారుణంగా వ్యవహరించారని గోరంట్ల విమర్శించారు. అయితే, చంద్రబాబు అడ్డంకులు దాటుకుని అనపర్తిలో సభ నిర్వహించారని తెలిపారు.

Gorantla Butchaiah Chowdary
TDP
Chandrababu
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News